1
1. చాంద్రసౌర మానం (luni solar year)
*చైత్ర శుద్ధ పాడ్యమితో సంవత్సరం ప్రారంభమవుతుంది. దీన్నే ఉగాది లేదా యుగాది లేదా సంవత్సరాది అని పిలుస్తారు.
*నెల శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. అమావాస్య అంతముతో ముగుస్తుంది.
*సూర్యుడు ఏ రాశిలో ఉండగా శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభమవుతుందో ఆ రాశి పేరు మీదుగా చాంద్రమాసములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. మీనం---చైత్ర
2. మేషం--వైశాఖ
3. వృషభం--జ్యేష్ఠ
4. మిధునం--ఆషాఢ
5. కర్కాటకం--శ్రావణ
6. సింహం--భాద్రపద
7. కన్య--ఆశ్వయుజ
8. తుల--కార్తీక
9. వృశ్చికం--మార్గశిర
10. ధనుస్సు--పుష్య
11. మకరం--మాఘ
12. కుంభం--ఫాల్గుణ
*సూర్యుడు ఒక రాశిలో ఉండగా రెండు శుద్ధ పాడ్యమి తిథులు ప్రారంభమైనచో మొదటి దానిని అధికమాసమని రెండో దాన్ని నిజమాసం అని అంటారు.
*అధికమాసములో పండుగలు నిషేధం.
*సూర్యుడు ఒక రాశిలో ఉండగా శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం అవ్వనచో దాన్ని క్షయమాసం అంటారు.
*సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని సౌలభ్యం కోసం తేదీగా మలుచుకోవాలి.
*పండుగ లేదా ఏదైనా కార్యం తిథికి అనుగుణంగా జరుపుకోవాలి.
*క్షయ లేదా వృద్ధి తిథి జరిగినచో ముందు రోజునే పండుగగా జరుపుకోవాలి.
2
2. నిరయన సౌర మానం (sidereal solar year)
*సూర్యుడు మేషరాశిలోకి (sun sidereal longitude: 0.000) ప్రవేశించగానే సంవత్సరం ప్రారంభమవుతుంది.
*రాశి సంక్రమణం సూర్యాస్తమయానికి ముందు జరిగితే ఆ రోజునే సంక్రాంతిగా జరుపుకోవాలి. సూర్యాస్తమయానికి తరువాత జరిగితే మరుసటి రోజున సంక్రాంతి జరుపుకోవాలి.
*మకర సంక్రాంతి (sun sidereal longitude: 270.000) ని పెద్ద పండుగగా జరుపుకోవాలి. అది ఉత్తరాయణం అనుకోవడంలో పెద్ద తప్పు ఏమీ లేదు కానీ అది నిజమైన ఉత్తరాయణం కాదు.
3
3. సాయన సౌర మానం (tropical solar year)
*వసంత విషువత్ తో (sun tropical longitude: 0.000) సంవత్సరం ప్రారంభమవుతుంది. పగలు రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉండే రోజు.
*వేసవి అయనాంత (sun tropical longitude: 90.000) రోజున దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. పగటి సమయం ఎక్కువగాను రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది.
*శరత్ విషువత్ (sun tropical longitude: 180.000) రోజున కూడా పగలు రాత్రి సమయాలు దాదాపు సమానంగానే ఉంటాయి.
*శీతాకాల అయనాంత (sun tropical longitude: 270.000) రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. పగటి సమయం తక్కువగాను రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది.